స్టేట్‌‌‌‌ లెవెల్‌‌‌‌ సీఎం కప్‌‌‌‌ పోటీలు షురూ

స్టేట్‌‌‌‌ లెవెల్‌‌‌‌ సీఎం కప్‌‌‌‌ పోటీలు షురూ

హైదరాబాద్‌‌‌‌: సీఎం కప్‌‌‌‌–2026 పోటీలను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర స్పోర్ట్స్‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ శివసేనా రెడ్డి, స్పోర్ట్స్‌‌‌‌ అథారిటీ  ఎండీ సోనీ బాలాదేవి శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించారు. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వివిధ స్కూల్స్‌‌‌‌, కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు  మార్చ్‌‌‌‌ ఫాస్ట్‌‌‌‌తో గౌరవ వందనం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్‌‌‌‌ షో, శివమణి ప్రదర్శన ఆకట్టుకుంది. రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రగ్రామిగా నిలపాలనే లక్ష్యంగా సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి స్పోర్ట్స్‌‌‌‌ పాలసీని తీసుకొచ్చారని శ్రీహరి అన్నారు. ఆటల్లో క్రమశిక్షణ ఉంటేనే విజయం సాధ్యమవుతుందన్నారు. దేశం, రాష్ట్రం తరఫున ఆడాలనే స్ఫూర్తి ప్రతి ప్లేయర్​లో ఉండాలని సూచించారు.