డేవిస్ కప్ క్వాలిఫైయర్స్ రౌండ్-2: సియోల్‌లో కొరియాతో భారత్ ఢీ

డేవిస్ కప్ క్వాలిఫైయర్స్ రౌండ్-2: సియోల్‌లో కొరియాతో భారత్ ఢీ

న్యూఢిల్లీ: డేవిస్‌‌ కప్‌‌ క్వాలిఫయర్స్‌‌ రౌండ్‌‌–2 పోటీలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌‌ 18, 19వ తేదీల్లో సియోల్‌‌లోని ఒలింపిక్‌‌ టెన్నిస్‌‌ సెంటర్‌‌లో హార్డ్‌‌ కోర్టులపై ఈ మ్యాచ్‌‌లను నిర్వహించేందుకు కొరియా రెడీ అయ్యింది.

దాంతో ఈ మ్యాచ్‌‌ల్లో ఇండియాకు కఠిన పరీక్ష తప్పదు. ర్యాంకింగ్స్‌‌లో ఇండియా 19, కొరియా 16వ స్థానంలో ఉన్నాయి. అయితే ఇరుజట్ల ముఖాముఖి రికార్డులో కొరియా 6–5 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ కీలక పోరు కోసం ఈ నెల 10న ఇండియా జట్టును ఎంపిక చేయనున్నారు. చివరిసారిగా 2016లో చండీగఢ్‌‌లో జరిగిన మ్యాచ్‌‌లో ఇండియా 4–1తో కొరియాపై గెలిచింది. హార్డ్‌‌ కోర్టుల్లో రాణించడంలో కొరియా ప్లేయర్లు దిట్ట కావడంతో అప్పట్లో ఇండియా ఉద్దేశపూర్వకంగా గ్రాస్‌‌ కోర్టులను ఎంచుకుంది. ఇప్పుడు కొరియా దానికి ప్రతీకారం తీర్చుకోబోతున్నది. ఈ మ్యాచ్‌‌లో విజయం సాధించిన జట్లు నవంబర్‌‌లో జరిగే డేవిస్‌‌ కప్‌‌ ఫైనల్‌‌–8కి దూసుకెళ్తాయి.