
అనారోగ్యం కారణంగా మరణించిన ప్రముఖ దర్శకురాలు, అలనాటి నటి విజయ నిర్మల భౌతికఖాయానికి ఏపీ సీఎం జగన్ నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమైన కృష్ణను ఓదార్చిన జగన్..ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జగన్ వెంట రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి ఉన్నారు. మధ్యాహ్నం చిలుకూరులోని వ్యవసాయ క్షేత్రంలో విజయ నిర్మల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అనారోగ్యం కారణంగా నానక్ రాం గూడలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి విజయ నిర్మల తుదిశ్వాస విడిచారు.