లా యూనివర్సిటీ పనులు ప్రారంభించిన సీఎం జగన్.!

లా యూనివర్సిటీ పనులు ప్రారంభించిన సీఎం జగన్.!

కర్నూలులో పర్యటించిన సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లా యూనివర్సిటీ పనులను ప్రారంభించారు సీఎం జగన్. ఈ క్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాజధానిని హైదరాబాద్ కి తరలించే సమయంలో కర్నాలులో హైకోర్టు పెట్టాలన్న ఒప్పందం జరిగిందని, ఆ ఒప్పందం ప్రకారమే ఇప్పుడు కర్నూలును న్యాయరాజధానిగా చేయాలని నిర్ణయించామని అన్నారు. శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారంగానే కర్నూలులో హైకోర్టు నిర్మించాలని డిసైడ్ చేశామని అన్నారు.

కర్నూలులో ఎన్ హెచ్ఆర్సీ, లోకాయుక్త, హైకోర్టు నిర్మిస్తామని జగన్ అన్నారు. నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణం కోసం అడుగులు వేగంగా పడాలని కోరుకుంటున్నాని అన్నారు. లా యూనివర్సిటీ కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. లా యూనివర్సిటీతో పాటు పలు అనుబంధ విభాగాలు కూడా కర్నూలులో ఏర్పాటు చేస్తున్నామని, వీటివల్ల కర్నూలు ప్రాంతానికి మేలు జరుగుతుందని అన్నారు జగన్.