దిశ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన సీఎం జగన్

దిశ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన సీఎం జగన్

మహిళలు, బాలల భద్రతను ప్రతిష్టాత్మకం తీసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ (శనివారం) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్..దిశ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలో దిశ మొదటి పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దిశ ప్రత్యేక పోలీసు స్టేషనును పరిశీలించారు. ఆ తర్వాత దిశ.. SOS యాప్‌ను జగన్‌ ప్రారంభించారు. అది ఎలా పని చేస్తుందో అధికారులు లైవ్‌లో చూపించారు.

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో స్టేషన్‌లో డీఎస్పీలు, సీఐలు ఇద్దరు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్‌ సిబ్బంది ఉంటారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్‌ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.