చెప్పకుండా వస్తా తనిఖీలు చేస్తా: సీఎం జగన్

చెప్పకుండా వస్తా తనిఖీలు చేస్తా: సీఎం జగన్

స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ లతో, ఎస్పీల తో వీడియో కన్ఫిరెన్స్ లో మాట్లాడారు. ప్రతీ సోమవారం తప్పక స్పందన కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు తెలిపారు జగన్. ఏపీ ప్రజల సమస్యలను తొందరగా తీర్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు వారి సమస్యలపై ఇచ్చిన వినతి పత్రాలకు గాను రిసిప్ట్ ఇవ్వాలని… ఆ సమస్యను ఎన్ని రోజులలో పూర్తి చేయగలరో కూడా రిసిప్ట్ లో మెన్షన్ చేయాలని చెప్పారు. ఈ డీటేల్స్ ను తప్పక కంప్యూటరైజ్డ్ చేయాలని సూచించారు. తాను కూడా స్పందన కార్యక్రమంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని చెప్పారు . ప్రతీ మంగళ వారం కలెక్టర్ లతో, ఎస్పీలతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహిస్తనని అన్నారు జగన్.