సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ తీర్పు వాయిదా

V6 Velugu Posted on Aug 25, 2021

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను సీబీఐ కోర్టు నేడు పరిశీలించింది. అందులో భాగంగా జగన్ బెయిల్ రద్దు పిటీషన్, విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై సెప్టెంబర్ 15న ఒకేసారి తీర్పు ఇస్తామని సీబీఐ కోర్టు తెలిపింది.

Tagged andhrapradesh, CM YS Jagan mohan reddy, CBI court, MP RaghuRamakrishan raju

Latest Videos

Subscribe Now

More News