కాన్వాయ్ బస్సులోనే కేసీఆర్ భోజనం

కాన్వాయ్ బస్సులోనే కేసీఆర్ భోజనం

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న పంటల పరిశీలనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. తన కాన్వాయ్ లో భోజనం చేశారు.  హెలీప్యాడ్ దగ్గర కొద్దిసేపు కాన్వాయ్ ఆపారు అధికారులు. బస్సులోనే సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు భోజనం చేశారు. మార్చి 23వ తేదీ గురువారం గాలి వానకు పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో.. కేసీఆర్ అండ్ టీం ఈ విధంగా భోజనం చేయటం విశేషం.

బస్సులోని ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కొసరి కొసరి వడ్డించారు. పులిహోరతోపాటు ఇతర ఆహార పదార్థాలను స్వయంగా వడ్డిస్తూ.. అందరూ తిన్నారా లేదా అని మరీ మరీ అడిగారు. ఎర్రబెల్లి వడ్డింపులో పులిహోర ఐటమ్స్ స్పెషల్ గా కనిపించింది. ఇక మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ప్లాస్టిక్ బౌల్స్ లోనే తినటం విచిత్రం. అటు ఎంపీ సంతోష్ కుమార్ మాత్రం ప్లేట్ లో భోజనం చేశారు.  

సీఎం టూర్ అంటే అన్నీ ముందుగానే అరేంజ్ చేస్తారు అధికారులు. అయితే నాలుగు, ఐదు చోట్ల ఒకే రోజు పర్యటన చేయాల్సి రావటంతో.. టైం సరిపోదని.. బస్సులోనే ఈ విధంగా భోజనం కానిచ్చేశారు. ఎర్రబెల్లి అయితే అందరికీ స్వయంగా వడ్డిస్తూ స్పెషల్ గా కనిపించారు విజువల్స్ లో.. సీఎం కేసీఆర్ కూడా పులిహోరతోపాటు అరటి పండు తిన్నారు.. సీఎం కేసీఆర్ బస్సులో భోజనం విజువల్స్ వైరల్ అయ్యాయి..