రాజ్యాంగబద్దంగానే సీఎల్పీ విలీనం : కేసీఆర్

రాజ్యాంగబద్దంగానే సీఎల్పీ విలీనం : కేసీఆర్

కాంగ్రెస్ నేతలు తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై వివరణ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ బీఎస్పీని విలీనం చేసుకుందాన్నారు.  నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీ విలీనం చేసుకుందన్నారు. తెలంగాణలో రాజ్యాంగబద్ధంగానే సీఎల్పీ టీఆర్ ఎస్ లో  విలీనం అయ్యిందన్నారు. రాష్ట్రానికో రాజ్యంగం ఉంటుందా? అని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల పాలనలో  పథకాల పేర్లు మారాయి తప్ప చేసిందేమి లేదన్నారు. ఇదే సభలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్నప్పుడు సభలో లేరా అని ప్రశ్నించారు? ప్రజల  ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ పార్టీలేనన్నారు. జీఎస్టీ మీద ఒక్క తెలంగాణ ప్రభుత్వమే కొట్లాడిందన్నారు.