సింగరేణి కార్మికులకు బోనస్‌

సింగరేణి కార్మికులకు బోనస్‌

ఈ ఏడాది సగటున ఒక్కో కార్మికుడికి రూ.1.15లక్షల వరకు బోనస్‌ చెల్లించనున్నట్లు చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు.  దీపావళి బోనస్‌ కింద ప్రతీ కార్మికుడు రూ. 72,500 అందుకోనున్నారని చెప్పారు. రెండు బోనస్‌ల చెల్లింపునకు సింగరేణి 379.07 కోట్ల రూపాయలను చెల్లిస్తుందన్నారు. సింగరేణి సంస్థ పండుగ అడ్వాన్స్‌ కింద ప్రతి కార్మికుడికి రూ.25 వేలు ప్రకటించిందని.. ఈ డబ్బును ఈ నెల 8న చెల్లించనుందని సీఎండీ శ్రీధర్ తెలిపారు. రెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్‌ కలిపి ఒక్కో కార్మికుడు సగటున సుమారు రూ.1.15 లక్షల వరకు అందుకోనున్నట్లు సీఎండీ చెప్పారు.

సంస్థ ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29శాతం వాటా ఇవ్వాలని నిన్న సీఎం కేసీఆర్‌తో జరిగిన సమీక్షలో నిర్ణయించారు. గతేడాది కంటే ఈసారి ఒక శాతం వాటాను అధికంగా పెంచారు. దసరా కంటే ముందే కార్మికులకు వాటాను చెల్లించాలని సీఎండీని కేసీఆర్‌ ఆదేశించారు.