మా దగ్గర ఇంకో రెండు స్కీములున్నాయ్: సీఎం కేసీఆర్

మా దగ్గర ఇంకో రెండు స్కీములున్నాయ్: సీఎం కేసీఆర్

అవి తెస్తే కాంగ్రెస్ పని ఖతమే

రాష్ట్రంలో సంక్షేమం, పరిపాలనపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తిప్పికొట్టారు. ద్రవ్య వినిమయ బిల్లుకు మద్దతివ్వాలని కోరుతూ.. ఆరోపణలకు సమాధానాలిచ్చారు కేసీఆర్. తెలంగాణను ఎవరూ ఇవ్వలేదని… రాష్ట్ర ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ కొట్లాడి తెలంగాణ సాధించించాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమ అధికారంపోయిందని అక్కసుతో ఉందని విమర్శించారు. సీఎల్పీ విలీనం రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగానే జరిగిందన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తేనే ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ గత ఐదేళ్లలో అద్భుతమైన పనితీరు చూపించింది కాబట్టే జనం మళ్లీ ఓట్లేసి గెలిపించారని చెప్పారు. తమ దగ్గర మరో రెండు అద్భుత స్కీములున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. అవి అమలు చేయడం ప్రారంభిస్తే.. కాంగ్రెస్ పని ఖతమైపోతుందని చెప్పారు.

పేదల పక్షపాతంగా.. రైతుల పక్షపాతంగా వంద శాతం అవినీతి రహితంగా ముందుకెళ్తామన్నారు కేసీఆర్. బడ్జెట్ బిల్లు ఆమోదానికి సహకరించాలని కోరారు.