డేటా చోరీపై సిట్ దర్యాప్తు : కేసీఆర్ సంచలన నిర్ణయం

డేటా చోరీపై సిట్ దర్యాప్తు : కేసీఆర్ సంచలన నిర్ణయం

డేటా చోరీ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇంచార్జీగా వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్రను నియమించింది. సిట్ బృందంలో సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, DSP రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో ఇద్దరు ఇన్ స్పెక్టర్లను నియమించింది. జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్ కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. డీజీపీ కార్యాలయంలోనే సిట్ కు సంబంధించి ప్రత్యేక చాంబర్ ను కేటాయించింది సర్కార్.