ఏపీ తో కలిసే ఉంటాం..అలా అని రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: సీఎం కేసీఆర్

ఏపీ తో కలిసే ఉంటాం..అలా అని రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: సీఎం కేసీఆర్

ఏపీ తో కలిసి ఉన్నాము కలిసే ఉంటాం.. అలా అని రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు  సీఎం కేసీఆర్. లాక్ డౌన్ పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏపీ తో కలిసి ఉన్నాము కలిసే ఉంటాం.  నీటి వాటాలపై ఇరు రాష్ట్రాల సీఎం లకు అవగాహన ఉందని అన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన కేటాయింపుల్ని వాడుకుంటున్నట్లు చెప్పిన సీఎం.. పోతిరెడ్డిపాడు విషయంలో ఆంధ్ర సీఎం లకు సంచులు మోసింది ఎవరు వాళ్ళు కాదా అంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి సీఎం కేసీఆర్  వ్యాఖ్యానించారు.

అంతా చట్ట ప్రకారమే ప్రాజెక్ట్ ల నిర్మాణం

రాష్ట్రంలో ప్రాజెక్ట్ లు చట్ట ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయన్న సీఎం కేసీఆర్.. నీరు సముద్రంలో కలవడం ఎందుకు…? రాయలసీమ కు నీళ్లు వాడుకోవచ్చని సూచించారు. గోదావరిలో రాష్ట్రానికి 959 టీఎంసీలతో  పాటు మరో 650 టీఎంసీల నీరు కావాలి ఆ విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకుంటామన్నారు.

బస్తీమే సవాల్ అని చంద్రబాబు ఏం సాధించారు

గతంలో చంద్రబాబు ప్రాజెక్ట్ ల విషయంలో హంగామా చేసి ఒక్క టీఎంసీ నీరు   సాధించారా..? బాబ్లీ ప్రాజెక్టు మీద ఒక బోగస్ పోరాటం చేశారని విమర్శించారు. మమహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏడుసార్లు కలిసి.. ప్రాజెక్ట్ లను నిర్మించిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.