
మేడిగడ్డ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు.. హాజరైన అతిథులకు కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలను వివరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ లకు కాళేశ్వరం ఎత్తిపోతలలోని బ్యారేజీలు, ప్రాజెక్టు గురించి వివరించారు. ఆ తర్వాత అందరూ ఫొటో ఎగ్జిబిషన్ , వీడియో ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు.
అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు 3 గంటల పాటు జలహోమం నిర్వహించారు. యాగ సమయంలో మేడిగడ్డకు చేరుకున్న జగన్, నరసింహన్, దేవేంద్ర ఫఢ్నవీస్ లను కేసీఆర్ శాలువాలు కప్పి స్వాగతించారు.