600 కార్లు 2 వేల మందితో మహారాష్ట్రకు కేసీఆర్

600 కార్లు 2 వేల మందితో మహారాష్ట్రకు కేసీఆర్

సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు.  ప్రగతి భవన్ నుంచి 600 కార్లు, 2 వేల మందితో భారీ కాన్వాయ్ తో వెళ్లారు.  భారీ ర్యాలీతో పంజాగుట్ట, అమీర్ పేట, మియాపూర్ మీదుగా  సంగారెడ్డి, జహీరాబాద్ నుంచి మహారాష్ట్రలోకి ఎంట్రీ ఇస్తారు.  కేసీఆర్ వెంట ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ఉన్నారు.  కేసీఆర్ వెంట 600 కార్లు వెళ్లడంతో పంజాగుట్ట నుంచి  మియాపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేసీఆర్ కాన్వాయ్ వెళ్తున్నసందర్భంగా వాహనదారులను ఎక్కడిక్కడ ఆపేశారు. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. 

రెండు రోజులు మహారాష్ట్రలోనే కేసీఆర్

సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో రెండు రోజులు పర్యటించనున్నారు.  ఇవాళ  షోలాపూర్ లో  అక్కడి బీఆర్ఎస్ నేతలు, తెలంగాణకు చెందిన చేనేత కార్మికులతో సమావేశమవుతారు. రాత్రికి సోలాపూర్ లో బస చేస్తారు. జూన్ 27న   పండరీపూర్ లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతారు.  తిరుగు ప్రయాణంలో దారాశివ్ జిల్లాలోని తుల్జాభవాని ఆలయంలో కేసీఆర్ పూజలు చేస్తారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత  కేసీఆర్ ఆ రాష్ట్రానికి వెళ్లడం ఇది ఐదోసారి