పాపన్న గౌడ్ స్ఫూర్తిని కొనసాగిస్తాం

పాపన్న గౌడ్ స్ఫూర్తిని కొనసాగిస్తాం

హైదరాబాద్: వీరత్వానికి సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఇవాళ సర్వాయి పాపన్న 372వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా సర్వాయి పాపన్న నిలిచారని చెప్పారు. సర్వాయి పాపన్న జీవితం నేటి యువతకు ఆదర్శమని, అలాంటి మహనీయులను తలచుకోవాల్సన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి... పాపన్న పోరాడిన తీరు గొప్పదని సీఎం కేసీఆర్ అన్నారు.

సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్న కేసీఆర్... బడగు, బలహీన వర్గాల నాయకత్వానికి సముచిత గౌరవం ఇస్తున్నామని తెలిపారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ ప్రదర్శించిన  ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా... సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.