
బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో నిర్వహించాలని పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయించారు. పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ సహా రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, జెడ్పీ చైర్పర్సన్లు, స్టేట్ లెవల్ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్పర్సన్లను ఆహ్వానించారు. ఎలక్షన్ ఇయర్ నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్లడం, పార్టీ కార్యకలాపాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఆహ్వానించిన వారంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.