ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించిన కేసీఆర్

ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించిన కేసీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ బిజిబిజీగా ఉన్నారు. సిరిసిల్ల మండలం సర్ధాపూర్ లో  నిర్మించిన  వ్యవసాయ  మార్కెట్ యార్డ్ ను ప్రారంభించారు  .ముందుగా తంగళ్లపల్లి మండలం   మండెపల్లిలో డబుల్ బెడ్రూం  ఇండ్లను ప్రారంభించారు . లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. తర్వాత మండెపల్లిలో నిర్మించిన  అంతర్జాతీయ  డ్రైవింగ్  స్కూల్ ను  ప్రారంభించారు.   సిరిసిల్లలో నిర్మించిన  నర్సింగ్ కాలేజీ భవనం ప్రారంభించారు.   చివరగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్  భవనాన్ని ప్రారంభించి.... అధికారులతో  రివ్యూ చేస్తారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్  తిరుగు ప్రయాణం  అవుతారు సీఎం కేసీఆర్.

సీఎం పర్యటన  సందర్భంగా.. జిల్లాల్లో  విపక్ష నేతలను  ముందస్తు  అరెస్ట్ లు చేశారు పోలీసులు. బోయిన్ పల్లి మండలంలో బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. రెండ్రోజుల క్రితం.. సీఎం పర్యటనను అడ్డుకోవద్దని.. రాస్తారోకోలు చేయొద్దని బీజేపీ నాయకులతో లెటర్ రాయించుకున్న బోయిన్ పల్లి పోలీసు.. రాత్రి.. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. వేములవాడ పట్టణంతో పాటు.. చందుర్తి, కోనరావుపేట మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సీఎం పర్యటన జరిగే  ప్రాంతాల్లో   భారీ బందోబస్తు  ఏర్పాటు చేశారు.  ఇక ముఖ్యమంత్రి కేసీఆర్  పర్యటన  సందర్భంగా   సిరిసిల్ల పట్టణంలో  భారీ ఫ్లెక్సీలు,  హోర్డింగులు  ఏర్పాటు చేశారు  టీఆర్ఎస్ లీడర్లు .