రష్యా ఆయిల్‌తో జనానికి పైసా లాభం లేదు: కంపెనీలు లక్షల కోట్లు సంపాదించాయి..!

రష్యా ఆయిల్‌తో జనానికి పైసా లాభం లేదు: కంపెనీలు లక్షల కోట్లు సంపాదించాయి..!

Cheap Russian Oil: గడచిన మూడేళ్ల నుంచి భారత్ తన చమురు అవసరాల కోసం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటోంది. దీంతో ప్రపంచ మార్కెట్లలో రేటు కంటే 5 డాలర్ల నుంచి 30 డాలర్ల వరకు బ్యారెల్ రేటుపై డిస్కౌంట్ పొందాయి దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆయిల్ రిఫైనరీలు. అయితే ఆయిల్ తక్కువ రేటుకు రావటం వల్ల సామాన్య భారతీయుడికి దక్కిన లాభం సూన్యం. 

అయితే రష్యన్ క్రూడాయిల్ లాభాలు దేశీయ ఆయిల్ రిఫైనరీల ఖాతాలకు చేరాయి. తగ్గింపులో 65 శాతం ప్రభుత్వ ప్రైవేటు ఆయిల్ కంపెనీలకు లాభాలుగా మారగా.. మిగిలిన మెుత్తం ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో వెళ్లిపోయింది. ఇక్కడ సగటు మధ్యతరగతి భారతీయుడు కోరుకునే రేటు తగ్గింపు బెనిఫిట్ అస్సలు ఇవ్వలేదు ప్రభుత్వం. దీంతో ఆయిల్ కంపెనీల లాభాలు గడచిన సంవత్సరంలోనే 25 రెట్లు పెరిగిపోయింది. ప్రభుత్వానికి పన్నుల ఆదాయం కూడా 46 శాతం పెరిగినట్లు తేలింది.

మరో పక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలపకపోవటంతో సుంకాలను 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. తక్కువ రేటుకు వచ్చిన రష్యన్ ఆయిల్ వల్ల మూడు ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ కంపెనీల లాభం 2022-23లో రూ.3వేల 400 కోట్ల నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.86వేల కోట్లకు పెరిగాయి. ఇక ప్రైవేటు ఆయిల్ కంపెనీలైన రిలయన్స్, నయారా కూడా దీని నుంచి గట్టిగానే లాభపడ్డాయని తేలింది. 

ALSO READ : ట్రంప్‌ పెద్ద నేరస్థుడు, 34 కేసుల్లో దోషి..

ప్రస్తుతం భారత్ 37 శాతం చమురును రష్యా నుంచి బ్యారెల్ 63 డాలర్లకు కొనుగోలు చేస్తోంది. దీని తర్వాత ఎక్కువగా ఇరాక్ నుంచి బ్యారెల్ 78 డాలర్ల చొప్పున 21 శాతం దిగుమతి చేసుకుంటోంది. ఇక సౌదీ అరేబియా నుంచి 15 శాతం అవసరాలను బ్యారెల్ 83 డాలర్ల లెక్కన దిగుమతి చేసుకుంటోంది భారత్. ఇక తర్వాత యూఏఈ, అమెరికా, నైజీరియా, అంగోలా, కువైట్, బ్రెజిల్, ఇరాన్ వంటి దేశాల నుంచి మిగిలిన మెుత్తాన్ని కొంటోంది. మెుత్తానికి రష్యన్ ఆయిల్ దిగుమతులపై అనిశ్చితులు ఏర్పడిన నేపధ్యంలో భవిష్యత్తులో రేట్లు పెరగటమే తప్ప తగ్గే సూచనలు ఎక్కడా కనిపించటం లేదు. ఒక వేళ రేట్లు తగ్గినా అవి సామాన్యులకు మాత్రం అస్సలు అందించే ఉద్దేశంలో ప్రభుత్వాలు లేవని స్పష్టంగా కనిపిస్తోంది.