కంచ గచ్చిబౌలి కేసు : అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు..తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

 కంచ గచ్చిబౌలి కేసు : అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు..తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

కంచ గచ్చిబౌలి భూముల కేసు విచారణ సందర్భంగా  ఆగస్టు 13న  సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామని తెలిపింది. హైదరాబాద్ శివార్లలోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం 1,000 చెట్లను నరికివేయడంపై సుమోటోగా దాఖలైన కేసును చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్. కే వినోద్ చంద్రన్ తో కూడిన బెంచ్ విచారించింది. 

ఈ సందర్భంగా తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన మెరుగైన ప్రతిపాదనతో వస్తే స్వాగతిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక తో ముందుకు వస్తే.. గతంలో చేసిన వ్యాఖ్య లను ఉప సంహరించుకుంటామని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ చెప్పారు. 

ఇదే కేసు విచారణలో జస్టిస్ గవాయ్ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎస్ కు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పర్యావరణాన్ని ధ్వంసం చేశారని, వన్యప్రాణులను ఇబ్బంది పెట్టారని, అక్కడ జరిగిన నష్టాన్ని పూడ్చాలని లేని పక్షంలో చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆ స్థలంలో మొక్కలు నాటాలని మెరుగైన ప్రతిపాదనలతో వస్తే తప్పకుండా అభినందిస్తామని అన్నారు. ఆరు వారాల పాటు సమయం ఇస్తే సమగ్ర నివేదిక ఇస్తామని అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. దీనిపై స్పందించిన సీజేఐ కేసును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి మంచి ప్రతిపాదనలతో రావాలని సూచించారు.