- సామాజిక న్యాయం కూడా జరగలేదు
- సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో పోరాడుతం
- హక్కులను మనం సాధించుకుందాం
- మేడారంలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ ఏర్పడిన తర్వాత 12 ఏండ్లలో ఏమీ సాధించుకోలేక పోయామని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో వేటిని కూడా సంపూర్ణంగా సాధించుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మేడారంలో సమ్మక్క, సారలమ్మను ఆమె దర్శించుకున్నారు. అంతకు ముందు గట్టమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిలు వెత్తు బంగారాన్ని (బెల్లం) అందించి మొక్కులు తీర్చుకున్నా రు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అమ్మవార్లు వారి జాతి కోసం చేసిన పోరాటం చరిత్రాత్మకమని చెప్పారు. ఇవాళ తెలంగాణ జాతి కోసం అందరం నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. మన హక్కులను సాధించుకునేందుకు సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. తల్లుల దయతో తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నట్టు ఆమె తెలిపారు.
