ఇయ్యాల (ఆగస్ట్ 13), రేపు (ఆగస్ట్ 14) ఐదు జిల్లాల్లో బడులు బంద్.. హైదరాబాద్‌‌లో హాఫ్ డే

ఇయ్యాల (ఆగస్ట్ 13), రేపు (ఆగస్ట్ 14) ఐదు జిల్లాల్లో బడులు బంద్.. హైదరాబాద్‌‌లో హాఫ్ డే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఐదు జిల్లాల్లోని స్కూళ్లకు బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటించింది. ఈ రెండ్రోజులు గ్రేటర్ హైదరాబాద్‌‌లోని స్కూళ్లకు మాత్రం హాఫ్ డే ఉంటుందని తెలిపింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ నెల 13,14 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలోని సర్కార్, ప్రైవేటు స్కూళ్లను కేవలం మార్నింగ్ షిఫ్ట్ మాత్రమే కొనసాగించాలని ఆదేశించారు. హనుమకొండ, జనగా మ, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మాత్రం పూర్తిగా హాలీడే ఉంటుందని వెల్లడించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. కాగా, మిగిలిన జిల్లాల్లోని బడులు యధాతథంగా కొనసాగనున్నాయి.