విద్యార్థులకు అలర్ట్.... ఆగస్టు 14న ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

విద్యార్థులకు అలర్ట్.... ఆగస్టు 14న  ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

భారీ వర్షాల కారణంగా ఆగస్టు 14న  మేడ్చల్  మల్కాజ్ గిరిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు జిల్లా డీఈవో. ప్రభుత్వ, జెడ్పీ,ఎయిడెడ్ స్కూళ్లు  ఈ  ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే  హాఫ్ డే  సెలవు ఇవ్వగా..ఇపుడు పూర్తి సెలవు ప్రకటించారు. 

 జగిత్యాల హనుమకొండ, వరంగల్, జనగామ,యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాలోని స్కూళ్లకు కూడా రేపు  సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.  విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.  మిగిలిన జిల్లాల్లోని బడులు యధాతథంగా కొనసాగనున్నాయి.

మరో 48 గంటల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం అందరు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అటు జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఐటీ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.