
Gold Price Today: దాదాపుగా 10 రోజుల పాటు ఆగస్టు ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్లు రాఖీ పండుగ నాటి నుంచి నిరంతరం తగ్గుతూ ఉన్నాయి. దీనికి ఒక ప్రధాన కారణంగా బంగారంపై సుంకాలు ఉండబోవని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించటమే. దీంతో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు కూడా విలువైన లోహాల్లో తమ పెట్టుబడులపై వెనక్కి తగ్గటం రిటైల్ మార్కెట్లలో రేట్లను తగ్గిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఇన్వెస్టర్లు అమెరికా ద్రవ్యోల్బణం డేటా, చైనాతో యూఎస్ ట్రేడ్ డీల్, రష్యా అమెరికా చర్చలు వంటి అంశాలపై దృష్టి పెట్టారు. రానున్న రోజుల్లో వీటి ఫలితాలే రేట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
24 క్యారెట్ల బంగారం రేటు ఆగస్టు 12తో పోల్చితే 10 గ్రాములకు రూ.50 తగ్గింది. దీంతో గ్రాముకు బంగారం రేటు కేవలం రూ.5 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో ఆగస్టు 13న బంగారం ధరలు తగ్గిన తర్వాత గ్రాముకు.. హైదరాబాదులో రూ.10వేల 135, వరంగల్ లో రూ.10వేల 135, కరీంనగర్ లో రూ.10వేల 135, నిజామాబాద్ లో రూ.10వేల 135, విశాఖలో రూ.10వేల 135, విజయవాడలో రూ.10వేల 135, తిరుపతిలో రూ.10వేల 135, నెల్లూరులో రూ.10వేల 135, కడపలో రూ.10వేల 135, అనంతపురంలో రూ.10వేల 135 వద్ద రిటైల్ మార్కెట్లో విక్రయించబడుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఆగస్టు 12తో పోల్చితే 10 గ్రాములకు ఇవాళ(ఆగస్టు 13న) రూ.50 తగ్గుదలను మాత్రమే నమోదు చేసింది. దీంతో రేట్లు తగ్గిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలు గ్రాముకు గమనిస్తే.. హైదరాబాదులో రూ.9వేల 290, వరంగల్ లో రూ.9వేల 290, కరీంనగర్ లో రూ.9వేల 290, నిజామాబాద్ లో రూ.9వేల 290, విశాఖలో రూ.9వేల 290, విజయవాడలో రూ.9వేల 290, తిరుపతిలో రూ.9వేల 290, నెల్లూరులో రూ.9వేల 290, కడపలో రూ.9వేల 290, అనంతపురంలో రూ.9వేల 290 వద్ద రిటైల్ మార్కెట్లో విక్రయించబడుతున్నాయి.
బుధవారం బంగారం రేట్లు స్వల్పంగా తగ్గినప్పటికీ వెండి రేటు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే కొనసాగుతోంది. దీంతో ఆగస్టు 13న కేజీ వెండి రేటు తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో రూ.లక్ష 25వేల వద్ద విక్రయించబడుతోంది. అంటే గ్రాము వెండి ధర రూ.125గా ఉంది.