రైల్వే శాఖ బిగ్ అలెర్ట్: ఐదు రోజుల పాటు 10 ట్రైన్స్ రద్దు.. ఎందుకంటే..

రైల్వే శాఖ బిగ్ అలెర్ట్:  ఐదు రోజుల పాటు 10 ట్రైన్స్ రద్దు.. ఎందుకంటే..

రైల్వే  ప్రయాణికులకు రైల్వే శాఖ బిగ్​ అలెర్ట్​ ప్రకటించింది.  పాపట్‌పల్లి-...  డోర్నకల్‌ బైపాస్‌ మధ్య 3వ రైల్వే లైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో పలు రైళ్లను ఐదు రోజుల పాటు రద్దు చేసింది దక్షిణమధ్య రైల్వే.  రైల్వేశాఖ తెలిపిన వివరాల ప్రకారం  10 రైళ్ల సర్వీసును ఐదు రోజుల పాటు పూర్తిగా నిలిపివేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. 

ఆగస్టు 14 నుంచి 5 రోజులపాటు రద్దయిన రైళ్లు ఇవే...

  • డోర్నకల్‌- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 67767)
  • విజయవాడ- డోర్నకల్‌ (ట్రెయిన్ నెంబర్ 67768)
  •  కాజీపేట- డోర్నకల్ (ట్రెయిన్ నెంబర్ 67765)
  •  డోర్నకల్‌- కాజీపేట (ట్రెయిన్ నెంబర్ 67766)
  •  విజయవాడ- సికింద్రాబాద్ (ట్రెయిన్ నెంబర్ 12713)
  • సికింద్రాబాద్‌- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 12714)
  • విజయవాడ- భద్రాచలం రోడ్ (ట్రెయిన్ నెంబర్ 67215)
  •  భద్రాచలం రోడ్‌- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 67216)
  •  గుంటూరు- సికింద్రాబాద్ (ట్రెయిన్ నెంబర్ 12705)
  •  సికింద్రాబాద్‌- గుంటూరు (ట్రెయిన్ నెంబర్ 12706)

రైలు ప్రయాణంలో ఏమైనా సహాయం కావాలంటే 139కు డయల్ చేయాలని అధికారులు సూచించారు. ట్రెయిన్ జర్నీలో ఏదైనా సమాచారం కావాలన్నా, సహాయంగానీ, ఎమర్జెన్సీ సపోర్ట్ కోసం ఆ నెంబర్ కు కాల్ చేస్తే సాయం అందుతుందని ప్రయాణికులకు రైల్వే అధికారులు  సూచించారు.

►ALSO READ | హైదరాబాద్ సిటీలో ఈ ఏరియా వాళ్లకు ఈ రాత్రి దబిడి దిబిడే: కుండపోత వర్షం అంటూ GHMC అలర్ట్