బంగాళాఖాతంలో అల్పపీడనం : వాయుగుండంగా మారే ఛాన్స్

బంగాళాఖాతంలో అల్పపీడనం : వాయుగుండంగా మారే ఛాన్స్

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని.. అత్యవసరమైతే తప్ప, బయటకి రావద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో సముద్ర మట్టానికి సగటున 3.1 – 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో బుధవారం ( ఆగస్టు 13 ) పశ్చిమమధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 

ఈ క్రమంలో పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, తూర్పుగోదావరి, నంద్యాల జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

ఇక గురువారం ( ఆగస్టు 14 )  కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప, బయటికి రావద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అధికారులు అప్రమత్తవ్వాలని సూచించింది.