
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ వన్డే సిరీస్ ను కోల్పోయింది. తొలి మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో శుభారంభం చేసిన పాక్.. ఆ తర్వాత వెస్టిండీస్ ధాటికి రెండు, మూడు వన్డేల్లో చిత్తుగా ఓడి సిరీస్ 1-2 తేడాతో సిరీస్ చేజార్చుకుంది. మంగళవారం (ఆగస్టు 12) ట్రినిడాడ్ వేదికగా బ్రియన్ లారా స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఆతిధ్య వెస్టిండీస్ 120 పరుగుల తేడాతో పాక్ పై భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ లో హోప్ (103) సెంచరీతో సత్తా చాటితే.. బౌలింగ్ లో జేడెన్ సీల్స్ 6 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ ఊహించని షాక్ ఇచ్చాడు.
293 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ మొదట నుంచి వికెట్లను కోల్పోతూ వచ్చింది. జేడెన్ సీల్స్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో పాకిస్థాన్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్ లని డకౌట్ చేసిన సీల్స్.. ఆ తర్వాత కెప్టెన్ రిజ్వాన్ ను పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు పంపాడు. బాబర్ అజామ్ కూడా 9 పరుగులకే ఔట్ కావడంతో పాకిస్థాన్ 23 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత పెద్దగా ఎవరూ రాణించకపోవడంతో 92 పరుగులకే ఆలౌటైంది. సల్మాన్ అఘా 30 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
పాకిస్థాన్ జట్టులో ఏకంగా ఐదుగురు డకౌట్ కావడంతో అక్కడ ఫ్యాన్స్ జట్టును తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. కెప్టెన్ షాయ్ హోప్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో ముందుండి నడిపించాడు. 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఛేజ్ కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో జస్టిన్ గ్రీవ్స్ (43) మెరుపులు మెరిపించాడు. హోప్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. సీల్స్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
MASSIVE WIN IN THE DECIDER! West Indies take the series 2-1 🔥#WIvPAK scorecard ▶️ https://t.co/P4xdH7SxmX pic.twitter.com/URV9KT2vYE
— ESPNcricinfo (@ESPNcricinfo) August 12, 2025