మినిస్టర్స్ క్వార్టర్స్‌‌లో మంత్రి వివేక్ గృహ ప్రవేశం

మినిస్టర్స్ క్వార్టర్స్‌‌లో మంత్రి వివేక్ గృహ ప్రవేశం

జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్  బంజారాహిల్స్‌‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌‌లో కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం కుటుంబ సమేతంగా గృహ ప్రవేశం చేశారు. ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్8లో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజలు, హోమాల మధ్య సంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై వివేక్ వెంకటస్వామికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో అడుగుపెట్టిన మంత్రిని అభినందించేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తన నివాసానికి వచ్చిన అతిథులను మంత్రి వివేక్ ఆత్మీయంగా ఆహ్వానించి, కృతజ్ఞతలు తెలియజేశారు.