వికారాబాద్ కలెక్టరేట్ ప్రారంభం

వికారాబాద్ కలెక్టరేట్ ప్రారంభం

వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. క‌లెక్టరేట్‌లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజ‌లు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మ‌హేశ్వర్ రెడ్డి, కాలే యాద‌య్య, పైల‌ట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సుర‌భి వాణిదేవి, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి పాల్గొన్నారు.

ఎన్నేప‌ల్లిలో సమీ‌కృత కలెక్టరేట్ కు ప్రభుత్వం 34 ఎక‌రాల భూమి కేటా‌యించింది. మొత్తం రూ.60.70కోట్లు వెచ్చించి కలెక్టరేట్ నిర్మాణం చేప‌ట్టింది. మొత్తం 42 విభాగాలు ఇక్కడ నుంచి పనిచేయనున్నాయి.అంతకుముందు నూత‌నంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాల‌యాన్ని  సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.