
సీఎం కేసీఆర్ ఒకప్పుడు రైతు అని తెలిపారు మంత్రి హరీష్ రావు. అందుకే రైతుల సమస్యలను ఒక్కోటి ఆయన పరిష్కరిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో నాబార్డ్ ఆధర్వంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ 2020కి ముఖ్యఅతిథిగా హరీష్ రావు హాజరయ్యారు.
గోదాంల నిర్మాణంతో పాటు, సూక్ష్మ సేద్యానికి అండగా నిలిచిన నాబార్డు సేవలు ప్రశంసనీయమన్నారు మంత్రి హరీష్. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్‌తో రైతులకు భరోసా ఇచ్చామన్నారు మంత్రి హరీష్ రావు.