అగ్రికల్చర్ వర్సిటీకి రూ.465 కోట్ల గ్రాంట్లు ఇవ్వండి : ఎంపీ మల్లు రవి

అగ్రికల్చర్ వర్సిటీకి  రూ.465 కోట్ల గ్రాంట్లు ఇవ్వండి : ఎంపీ మల్లు రవి
  •     కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు ఎంపీ మల్లు రవి వినతి
  •     సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖ అందజేత

న్యూఢిల్లీ, వెలుగు: అగ్రికల్చర్ వర్సిటీ సమగ్ర ఆధునికీకరణ, అభివృద్ధి కోసం రూ.465 కోట్లను ప్రత్యేక గ్రాంట్ల రూపంలో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ మల్లు రవి కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను కలిసి సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను అందజేశారు. ఈ వినతిపత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో రూ.465 కోట్ల ప్రతిపాదనలతో రూపొందించారు. 

ఈ మీటింగ్​లో దేశవ్యాప్తంగా సాగవుతున్న వరిలో 25 శాతం, మొక్కజొన్నలో 12 శాతం అగ్రి వర్సిటీ అభివృద్ధి చేసిన వంగడాలే వాడుతున్నారని మంత్రికి వివరించారు. వర్సిటీని ఆధునీకరించడం వల్ల 2047 నాటికి మానవ రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటివి సాధించవచ్చని చెప్పారు. ఈ ప్రణాళికలో భాగంగా ఏఐ, రోబోటిక్స్, డిజిటల్ అగ్రికల్చర్ ల్యాబ్‌ల ఏర్పాటు వంటి కీలక ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు.