630 మంది పోలీసులకు సేవా పతకాలు : రాష్ట్ర ప్రభుత్వం

630 మంది పోలీసులకు సేవా పతకాలు : రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. పోలీస్, ఫైర్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌, ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్‌‌‌‌ సహా కీల క విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన 630 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.  ఈ మేరకు హోంశాఖ స్పెషల్‌‌‌‌ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్‌‌‌‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సీఎం సర్వోన్నత పోలీస్ పతకం సహా ఆరు కేటగిరీల్లో పతకాలను ప్రకటించారు. 

సర్వోన్నత పోలీస్ పతకానికిగాను ఇంటె లిజెన్స్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ మనీశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ఎంపికయ్యారు. సేవా పతకానికిగాను 459 మంది, ఉత్తమ సేవా పతకానికి 94, మహోన్నత సేవ పతకానికి 16, కఠినసేవ 53,శౌర్యపతకానికి ఏడుగురిని ఎంపికచేశారు. వీరందరికి రాష్ట్ర అవతరణ దినోత్సం( జూన్ 2న) రోజున పతకాలను అందజేయనున్నారు.