ఫస్ట్ హాఫ్‌ రానాలా, సెకండాఫ్‌ సురేష్ బాబులా..

ఫస్ట్ హాఫ్‌ రానాలా, సెకండాఫ్‌ సురేష్ బాబులా..

శ్రీనందు హీరోగా నటిస్తూ, శ్యామ్ సుందర్ రెడ్డి తుడితో కలిసి నిర్మించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. దగ్గుబాటి రానాకు చెందిన స్పిరిట్ మీడియా బ్యాకింగ్​తో వస్తున్న ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకుడు.  గురువారం (జనవరి 01) సినిమా  ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా నందు చిత్ర విశేషాలను గురించి మాట్లాడాడు.

 ‘పద్దెనిమిదేళ్ల కెరీర్‌‌లో చాలా సినిమాలు చేశా. కానీ కథ ఎలా ఉందో చెప్పే ఆస్కారం లేదు.  నా జడ్జిమెంట్ తప్పో ఒప్పో అని తెలుసుకోడానికి ఓ ప్రయత్నం చేయాలనుకున్నా. అలా ఓ కథను, దర్శకుడిని నమ్మి చేసిన సినిమా ఇది. సురేష్ బాబు గారు మమ్మల్ని నమ్మి రిలీజ్ చేస్తుండడంతో నా జడ్జిమెంట్ రైట్ అని, తొంభై శాతం గెలిచానని అనిపించింది. ఒక అమ్మాయి వల్ల మోసపోయిన అబ్బాయి, మరో అమ్మాయి రాకతో బాగుపడతాడు. కథగా ఇది సింపుల్ లైన్. కానీ ప్రజెంట్ చేసిన స్టైల్ కొత్తగా ఉంటుంది. 

హీరోయిన్‌ క్యారెక్టర్‌‌ కొత్తగా ఉంటూ న్యూ  ఎక్స్​పీరియన్స్​ను  ఇస్తుంది. డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో న్యూ ఏజ్‌ ఫిల్మ్ మేకింగ్‌తో, ఎప్పుడూ చూడని ఎడిటింగ్‌తో ఎంగేజ్‌ చేస్తుంది  ఈ చిత్రంతో మూస పద్ధతుల్ని బ్రేక్ చేశాం. ఫస్ట్ హాఫ్‌ రానా దగ్గబాటిలా జెన్‌జీ ఆడియన్స్​కు, సెకండాఫ్‌ సురేష్‌ బాబు గారిలా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పాడు.