నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా మారి దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. జనవరి 14న సినిమా రిలీజ్ సందర్భంగా ‘రాజు గారి పెళ్లి రిసెప్షన్’ పేరుతో ఈవెంట్ నిర్వహించారు.
నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ ‘2024 లో వరుస విజయాల తర్వాత ఓ యాక్సిడెంట్ వల్ల షూటింగ్స్‌కు దూరమయ్యా. ఆ సమయంలో మా టీమ్‌తో కలిసి ఈ కథ రాసుకున్నా. గత ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేశాం. ఆరు నెలల్లో పూర్తి చేశాం. చాలా బాగా వచ్చింది.
ఒకప్పుడు ఏ హీరోల సినిమాలైతే థియేటర్‌కి వెళ్లి చూశానో.. ఇప్పుడు ఆ అభిమాన హీరోల సినిమాలతో పాటు నా సినిమా సంక్రాంతికి వస్తుండటం సంతోషంగా ఉంది. ఈసారి సంక్రాంతి సినిమాలతో తెలుగు సినిమాల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు. ఇలాంటి ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో భాగమవడం సంతోషంగా ఉందని మీనాక్షి చౌదరి చెప్పింది.
