జూడాల సమ్మె.. తెలియనట్లు కేసీఆర్ యాక్టింగ్

జూడాల సమ్మె.. తెలియనట్లు కేసీఆర్ యాక్టింగ్

హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మెకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మద్దతు తెలిపారు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న డిమాండ్ న్యాయమైందన్నారు. ఈ సమ్మెకు సీఎం కేసీఆరే కారణమని ఫైర్ అయ్యారు. జూడాలను పిలిచి ముఖ్యమంత్రి చర్చలు జరపాలని సూచించారు. 

'జూనియర్ డాక్టర్లు DMEకి సమ్మె నోటీసు ఇచ్చి పది రోజులు అవుతోంది. అయినా సమ్మె నోటీసు గురించి తెలియనట్లుగా సీఎం కేసీఆర్ యాక్టింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదు? జూడాలు కేసీఆర్ ఫామ్ హౌస్ కావాలని అడిగారా? కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్లు అడిగారా? కబ్జా చేసిన భూములు అడిగారా? వాళ్లకు రావలసిన స్టైఫండ్ ను ఇతర న్యాయమైన డిమాండ్లను అడుగుతున్నారు. జూనియర్ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తమ కుటుంబాలను వదిలిపెట్టి కరోనా పేషెంట్లకు సేవలు చేస్తున్నారు. జూనియర్ డాక్టర్లు.. కరోనా పేషెంట్లను చూసుకోండి. మీరు సమ్మె చేయొద్దు. మీ స్టైఫండ్, డిమాండ్లను కేసీఆర్ ఎందుకు పరిష్కరించరో బీజేపీ చూసుకుంటుంది' అని బండి సంజయ్ పేర్కొన్నారు.