
- కార్పొరేట్ కంపెనీల దళారి కేటీఆర్
- అమెజాన్‌కు పేదల భూములు ఇస్తున్నరని ప్రశ్నిస్తే ఎందుకు సమాధానం చెప్తలేరు
- హైటెక్ సిటీ దగ్గర స్థలాలను పార్థసారథికి ఇచ్చింది నిజం కాదా?
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
దేవరకొండ(చందంపేట),వెలుగు: ధరణి వల్ల రైతులకు ఎదురవుతున్న సమస్యలపై తాను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని సీఎం కేసీఆర్ తనను సన్నాసి అని, తనది సన్నాసి యాత్ర అని అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గన్నెర్లపల్లి వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను సన్నాసి అనాలంటే తనకు సభ్యత, సంస్కారం అడ్డు వస్తున్నాయన్నారు. అత్యంత సంపద కలిగిన అమెజాన్కంపెనీకి పేదల భూములను అప్పగిస్తున్నారని తాను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.హైటెక్ సిటీ దగ్గర విలువైన భూములను బండి పార్థసారథికి అప్పనంగా అప్పగించిన మాట వాస్తవం కాదా అని అడిగారు. కార్పొరేట్కంపెనీలకు మంత్రి కేటీఆర్దళారీగా వ్యవరిస్తున్నాడని ఆరోపించారు. ధరణి సాఫ్ట్ వేర్‌తో తండ్రీ, కొడుకులు భూ కుంభకోణానికి తెరలేపారని విమర్శించారు. అధికారం లోకి రాగానే బీఆర్ఎస్ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్, కాంగ్రెస్ ఆదివాసీ జాతీయ కో ఆర్డినేటర్నేనావత్ కిషన్‌నాయక్, పీసీసీ మెంబర్బీల్యానాయక్, జాలె నర్సింహారెడ్డి పాల్గొన్నారు.