కన్నెపల్లి పంప్ హౌజ్ కు చేరుకున్న సీఎంలు

కన్నెపల్లి పంప్ హౌజ్ కు చేరుకున్న సీఎంలు

జయశంకర్ జిల్లా : మేడిగడ్డ బ్యారేజీ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకున్నారు ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, ఫడ్నవీస్. అధికారులు కూడా వీరి వెంట వచ్చారు. కన్నెపల్లి పంప్ హౌజ్  దగ్గర పూజలు చేయనున్నారు. భారీ మోటార్ల స్వీచ్ ను ఆన్ చేసి కన్నెపల్లి పంప్ హౌజ్ ను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి గ్రావిటీ కాలువ ద్వారా అన్నారం బ్యారేజీ కి గోదావరి నీళ్లు చేరుతాయి.