
హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ సభకు అంతా సిద్దమైంది. ఇవాళ మధ్యాహ్నం జరిగే సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సీఎం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు జనాన్ని భారీగా తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు గులాబీ లీడర్లు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్ దగ్గరుండి సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం జరిగే సభలో పాల్గొనేందుకు మధ్యాహ్నం హుజూర్ వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. దీంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.
అటు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు పార్టీల లీడర్లు. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.