ఎలక్షన్ ప్లాన్: ఫామ్ హౌస్ లో కేసీఆర్, ప్రగతి భవన్ లో కేటీఆర్

ఎలక్షన్ ప్లాన్: ఫామ్ హౌస్ లో కేసీఆర్, ప్రగతి భవన్ లో కేటీఆర్

ఐసోలేషన్ లో ఉంటూనే ఎన్నికల ప్లానింగ్ లో బిజీగా ఉన్నారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్. ఫాంహౌస్ లో కేసీఆర్, క్యాంప్ ఆఫీస్ లో కేటీఆర్ ఐసోలేషన్ లో ఉన్నా..నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటున్నారు. క్యాంప్ ఆఫీసు నుంచే మున్పిపల్ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. వరుసగా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సిద్దిపేట మినహా మిగతా మున్సిపాలిటీల నాయకులతో ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితీరాలని సూచిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఎలక్షన్లు జరగనున్న మున్సిపాలిటీలపై పార్టీ నేతలకు సూచనలు చేస్తున్నారు.

నిన్న(శుక్రవారం) మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి కేటీఆర్..ఇవాళ(శనివారం) ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, బాలరాజు, అంజయ్యతో మీటింగ్ నిర్వహించారు. అంతేకాదు వరంగల్ నేతలు నన్నపనేని నరేందర్, వినయ్ భాస్కర్ తో చర్చించారు.  టెలికాన్ఫరెన్స్ లో ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాంటి ప్రణాళికలు చేపట్టాలనే విషయాలను వారితో చర్చించారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని ఆదేశించారు. అంతేకాదు.. ఎలక్షన్ జరిగే మున్సిపాలిటీల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫోన్లో అప్ డేట్స్ ఇవ్వాల్సిందిగా పార్టీ నాయకులకు చెప్పారు మంత్రి కేటీఆర్. ఇక సిద్ధిపేటకు సంబంధించి మంత్రి హరీష్ రావు చూసుకున్నట్లు తెలుస్తోంది.