కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్

కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్

ఢిల్లీలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయనతో పాటు కర్నాటక మాజీ సీఎం జేడీఎస్ నేత కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఉన్నారు. వారికి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ ఆఫీస్ ఆవరణలో కొనసాగుతున్న రాజశ్యామల యాగంలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. అఖిలేష్ యాదవ్, కుమారస్వామి సైతం యాగశాలను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. రైతు సంఘం నేతలు సైతం యాగానికి హాజరయ్యారు. 

ఉదయం సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు వచ్చారు. అక్కడ యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు.