50వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను కాజేయడానికి KCR కుట్ర: భట్టి

50వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను కాజేయడానికి KCR  కుట్ర: భట్టి

ఆర్టీసీ ని ప్రయివేట్ పరం  చేయడానికి సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క.  సోమవారం అసెంబ్లీ హాల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన… వరంగల్ కు చెందిన ఆర్టీసీ స్థలాన్ని trs నేతలకు కేసీఆర్ కట్టబెట్టారని అన్నారు. 50,000 కోట్ల ఆర్టీసీ ఆస్థులను కాజేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు.  ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని… తాము ఉద్యమం పాల్గొంటామని చెప్పారు.

ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలవల్లే RTC నష్టాల్లో ఉందని అన్నారు భట్టి విక్రమార్క. దసారా పండుగకు గత ప్రభుత్వాలు బోనస్  ఇచ్చేవని.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలను తీసేస్తున్నాడని అన్నారు. నెల రోజులముందే ఆర్టీసీ కార్మికులు తమ  సమస్యలు పరిష్కారం చేయాలని లేకపోతె సమ్మే చేస్తామని నోటీసులు ఇచ్చారని అన్నారు. ఉద్యమకాలంలో కేసీఆర్ ఇచ్చిన హామీలనే ఆర్టీసీ వాళ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాలని…. డీజిల్ పై ఉన్న  వ్యాట్ తగ్గించాలని…. బస్ పాస్ లపై ఉన్న బకాయులు చెల్లించాలని ఆర్టీసీ కార్మికులు అడిగారని చెప్పారు భట్టి.

డీజిల్ పై ఒక లీటర్ కు  20 రూపాయల వ్యాట్ ను ప్రభుత్వం విదిస్తుందని అన్నారు భట్టి విక్రమార్క.  డీజిల్ ధర రూ.40 ఉన్నప్పుడు ఉన్న ఆర్టీసీ టికెట్ రేటు… 73రూపాయలు అయినప్పుడు కూడా అవే చార్జీలు ఉన్నాయని అన్నారు. టికెట్ రేటు డీజిల్ ధరకు తగ్గట్టు పెరగకపోవడంకూడా ఆర్టీసీ నష్టాల్లో ఉండటానికి కారణమని చెప్పారు. వన్ ఇయర్ కు డీజిల్ పై  వేస్తున్న వ్యాట్ తో ఆర్టీసీ 20 కోట్లు నష్ట పోతుందని అన్నారు.

ప్రజాపక్షపాతిగా చెప్పుకునే సీపీఐ నాయకులు హుజూరాబాద్ ఎన్నికలలో టీఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించుకోవాలని అన్నారు భట్టి. కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పై పోరాడాలని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్థులను కాపాడుకోవడానికి కేసీఆర్ కు ప్రజలు అధికారం ఇచ్చారని…ఆస్తులను అమ్మడానికి కాదని అన్నారు. తెలంగాణ కేసీఆర్ ఎస్టేట్ కాదని అన్నారు. 5వేల కోట్ల అప్పులు ఉన్న ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి రెడీ అయిన కేసీఆర్… ఐదు ఏండ్లలో రాష్ట్రానికి 3లక్షల కోట్ల అప్పులు నెత్తిన పెట్టారని అన్నారు.