ఇష్టమున్నట్లు గీతలు గీసి ఏడు మండలాలను కలిపేసుకుంటారా?

ఇష్టమున్నట్లు గీతలు గీసి ఏడు మండలాలను కలిపేసుకుంటారా?

భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలను ఏపీలో కలపడాన్ని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ఇష్టమున్నట్లు గీతలు గీసి ఏడు మండలాలను కలిపేసుకున్నారని ఆయన అన్నారు. భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని.. మా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య సీఎంను కోరారు. పోడు భూములను దున్నుకునే వారిపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తున్నారని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సమాధానంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. 

‘ప్రభుత్వం అభివృద్ధి కోసం మాత్రమే భూమలు తీసుకుంటుంది. భూములు లాక్కోవడం మా పద్దతి కాదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే అసైన్డ్ భూములు తీసుకుంటున్నాం. వాటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పాం. గిరిజనులపై దాడులు చేయోద్దని అధికారులను ఆదేశించాం. భద్రాచలం నియోజకవర్గంలో ఏడు మండలాలను లాగేసుకున్నారు. ఇష్టమున్నట్లు గీతలు గీసి ఏడు మండలాలను కలిపేసుకుంటారా? ఏపీ ప్రభుత్వంతో ఏడు మండలాల విషయం మాట్లాడం. ప్రధానిని కలిసినప్పుడు మరోసారి ఆయనతో కూడా చర్చిస్తాం. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల పోడు భూముల సమస్య ఉంది. పోడు భూములపై అసెంబ్లీలో తీర్మానం చేద్దాం. అసెంబ్లీ తీర్మానం చేస్తే కేంద్రం కూడా ఆమోదిస్తుంది. ఈ సమస్య పరిష్కారం కోసం అఖిలపక్షంతో కలిసి ఢిల్లీ వెళ్లి మోడీని కలుద్దాం. చత్తీస్ ఘడ్ నుంచి గుత్తికోయలు పోడు భూములను ఆక్రమించుకుంటున్నారు. హరితహారం నిధి కోసం ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రతి నెలా తమ జీతాల నుంచి రూ. 500 చెల్లించాలని కోరుతున్నాం’ అని కేసీఆర్ అన్నారు.

For More News..

పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు.. ఆరోగ్యం

మణికొండ ఘటనలో మా తప్పుంది

ఏకగ్రీవ పంచాయతీలకు ఫండ్స్ ఇస్తమని మేం చెప్పలేదు