మణికొండ ఘటనలో మా తప్పుంది

మణికొండ ఘటనలో మా తప్పుంది

హైదరాబాద్ మణికొండలో నాలాలో పడి వ్యక్తి చనిపోయిన ఘటనపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. తమ శాఖ తప్పిదం వల్లే  డ్రైనేజీలో పడి రజినీకాంత్ అనే వ్యక్తి మృతి చెందినట్లు మంత్రి కేటీఆర్ మండలిలో ప్రకటించారు. డ్రైనేజీ గుంత చుట్టూ రెయిలింగ్ ఏర్పాటు చేయకపోవడం మా సంస్థ యొక్క తప్పిదం అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ రోడ్లపై నీరు నిలవడంపై మాట్లాడుతూ.. తారు, నీరు బద్ద శత్రువులని కేటీఆర్ అన్నారు.

‘ఈ ఘటనలో మా డిపార్ట్‎మెంట్ నిర్లక్ష్యం కచ్చితంగా ఉంది. ఇది బాధాకరమైన విషయం. ఈ ఘటనపై బాధ్యత తీసుకుంటాం.  బాధితుడి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటాం. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్‎లను సస్పెండ్ చేశాం. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపడుతున్నాం. ఇటువంటి ఘటన పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబానికి గతంలో 5 లక్షలు ఇచ్చాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ మేరకు.. మరోసారి ఆ కుటుంబానికి రూ. 10 లక్షలు అందజేస్తాం’ అని కేటీఆర్ అన్నారు.

For More News..

కేసీఆర్, కేటీఆర్.. ఆ విషయంలో మేధావులు

వారికి నచ్చిన గ్రామాలకే నిధులిస్తున్నారు

ఏకగ్రీవ పంచాయతీలకు ఫండ్స్ ఇస్తమని మేం చెప్పలేదు