వారికి నచ్చిన గ్రామాలకే నిధులిస్తున్నారు

వారికి నచ్చిన గ్రామాలకే నిధులిస్తున్నారు

అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మరియు స్పీకర్ పోచారంల మధ్య కాసేపు వాగ్యుద్దం నడిచింది. దాంతో సీతక్క మాటలకు సమాధానమిస్తూ కేసీఆర్ కౌంటరిచ్చారు. అయితే కేసీఆర్ మాట్లాడిన విధానం సరిగాలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఉపాధిహామీ మెటిరియల్ నిధులు గ్రామాల్లో వాడుతున్నారా లేదా? అని ఆయన ప్రశ్నించారు.

‘బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకులు వారికి నచ్చిన గ్రామాలకే నిధులిస్తున్నారు. పంచాయతీ సిబ్బందికి కూడా సర్పంచులే జీతాలిస్తున్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు ఇంకా ఫండ్స్ రాలేదు. సీతక్క పార్లమెంటరీ భాష మాత్రమే వాడారు. తప్పు ఏమీలేదు. సీతక్క ప్రశ్న అడుగుతుంటే స్పీకర్ అడ్డుపడటం బాధ అనిపించింది. ఉపాధి హామీ పథకం కింద 15వేల కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయి.15 వేల కోట్ల నిధులు దారిమళ్లించారా లేదా చెప్పాలి?గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం సర్పంచ్‎లు అప్పులు చేస్తున్నారు. ఒకటి రెండు చోట్ల సర్పంచ్‎లు నిధులు విడుదల కాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇది నిజం కాదా?’ అని భట్టి ప్రశ్నించారు.