బడ్జెట్ నిరాశ, నిస్పృహలకు గురిచేసింది : కేసీఆర్

బడ్జెట్ నిరాశ, నిస్పృహలకు గురిచేసింది : కేసీఆర్

హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశకు గురి చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దశా, దిశా లేని, పనికిమాలిన బడ్జెట్ గా అభివర్ణించారు. ఆర్థికమంత్రి ప్రగంసమంతా డొల్లతనం, మాటలగారడీతో కూడి ఉన్నదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రైతులు,పేదలకు, ఉద్యోగులను అన్యాయం జరిగిందని ఆరోపించారు. మసిపూసి మారేడు కాయ చేసిన బడ్జెట్ ఇది అన్న కేసీఆర్.. వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

కేంద్ర బడ్జెట్లో చేనేత రంగానికి సున్నా చుట్టిందని కేసీఆర్ మండిపడ్డారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఉద్యోగులు, చిరు వ్యాపారులను బడ్జెట్ లో తీవ్ర నిరాశకు గురిచేసిందని, ఇన్ కం ట్యాక్స్ స్లాబ్స్ లో ఎలాంటి మార్పు చేయకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం, మౌలిక రంగాల అభివృద్ధి విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించందని బడ్జెట్ ద్వారా తేటతెల్లమైందని అన్నారు. కరోనా కష్టకాలంలోహెల్త్ ఇన్ ఫ్రా అభివృద్ధిపై కేంద్రానికి సోయి లేకపోవడం దురదృష్టకరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.