హైదరాబాద్కు బయలుదేరిన సీఎం కేసీఆర్

హైదరాబాద్కు బయలుదేరిన సీఎం కేసీఆర్

వారం రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ హఠాత్తుగా హైదరాబాద్కు బయలుదేరారు. ఈ నెల 25 వరకు ఢిల్లీలోనే ఉండాల్సి ఉన్నా... అనూహ్యంగా హైదరాబాద్ బాట పట్టారు. బెంగళూరు, రాలేగావ్ సిద్ధి, షిర్డీ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా వాటిని రద్దు చేసుకుని షెడ్యూల్‌ కన్నా ముందే కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తిరిగిరావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ నెలాఖరులోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.  రాష్ట్రానికి అప్పులు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని.. ఈ క్రమంలో కేంద్రం వైఖరిని ఎండగట్టాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంపై వివక్ష వీడి కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు కేంద్రం పరిధిలోకి రాకుండా చూడాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ హఠాత్తుగా హైదరాబాద్ కు తిరిగి పయనమయ్యారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.