BRS గెలిస్తే రెండేళ్లలో దేశంలో వెలుగు జిలుగులు: కేసీఆర్

BRS గెలిస్తే రెండేళ్లలో దేశంలో వెలుగు జిలుగులు: కేసీఆర్

BRS కు అధికారం ఇస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్  చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. రాజకీయం అంటే బ్లఫ్ కాదు.. టాస్క్ అన్నారు. ప్రగతికి ఆటంకం కలిగే విషయంలో సవరణలు చేసుకోవాలని చెప్పారు. సంస్కరణలకు అవసరం అయ్యే మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పుష్కలంగా నీళ్ళు వుంటాయి.. కానీ నీళ్ళు రావు..రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ మంతా రైతులకు ఉచిత కరెంటుకు లక్షా 40 వేల కోట్లు ఖర్చు పెడితే  చాలు అది ఇవ్వలేమా అని ప్రశ్నించారు. తెలంగాణలో దళిత బంధు అందుకున్న దళిత బిడ్డలు కాలు మీద కాలు వేసుకొని జీవిస్తున్నారని తెలిపారు. విశాఖ ఉక్కును మోడీ ప్రభుత్వం అమ్మినా దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ తీసుకుంటామని ఏపీ వాసులకు హామీ ఇచ్చారు. 

దేశంలో వాటర్ పుష్కలంగా ఉంది

దేశంలో వాటర్ పుష్కలంగా ఉన్నా ప్రజలు ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు.  చైన్నైవాసులు బకెట్ నీటి కోసం పడిగాపులు.. కొట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రపంచం లో అతిపెద్ద రిజర్వాయర్ జింబాంబ్వేలో ఉందన్నారు. అక్కడి ప్రజల దాహార్తిని తీర్చేందుకు 6000 ల పైన టీఎంసీలతో నిర్మించారని చెప్పారు. తర్వాత రష్యా, అమెరికా లో 5000 నుంచి 1200 టీఎంసీ ల రిజర్వాయర్ లను నిర్మించారని తెలిపారు. చైనాలోని యాంగ్జీ నదిపై  నిర్మించిన త్రీగోర్జెస్‌ డ్యామ్‌ నీటిని 600 కిలోమీటర్లకుపైగా తరలిస్తున్నారని చెప్పారు.  మన దేశంలో మాత్రం అలాంటి భారీ ప్రాజెక్టులు ఒక్కటి కూడా లేవని..ఇక్కడి ప్రజలు ఏం పాపం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రాజెక్టులు కడితే కరువు రాదు 

దేశంలో మూడు, నాలుగు డ్యాములు వుంటే కరువు రాదు కదా అని కేసీఆర్ ప్రశ్నించారు. కట్టె స్థోమత వుండి కూడా ప్రాజెక్టులను ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీ లో తాగునీరు దొరకడం కష్టంగా మారిందన్నారు. అలాగే కరెంట్ కోతలు కామన్ గా మారిపోయాయని తెలిపారు. ఎన్నికల్లో గెలుపుకోసం నాయకుల ఉపన్యాసాలు వింటే చెవులు తూట్లు పడతాయన్నారు. మేధావులు ఎక్కడికి వెళ్లారని..నాయకులు అది చేస్తాం..ఇది చేస్తామని చెప్పేవాళ్లు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత బిడ్డలు ఇలాగే ఎన్ని రోజులు వుండాలని కేసీఆర్ నిలదీశారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు.. కానీ ప్రతి ఎన్నికల్లో ఓడిపోతున్నారు. నేతలు గెలుస్తారు. పార్టీ లు గెలుస్తున్నాయి.. ప్రజలు మాత్రం ఓడిపోతున్నారని చెప్పారు. దేశంలో అనేక సమస్యలకు పరిష్కారమే బీఆర్ఎస్ పార్టీని స్పష్టం చేశారు. 

రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్

‘‘ రాజకీయాలు అంటే దండలు వేయించుకోవడం కానే కాదు.. సన్మానాలు చేయించుకోవడం కాదు.. ఈ ఆలోచనా భావజాలం నుంచి బయటకు రావాలి. దాని నుంచి ప్రజలను బయటపడేసేందుకే బీఆర్ఎస్ పుట్టింది. రాజకీయాల్లో గుణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టేందుకే బీఆర్ఎస్ పెట్టినం. రాజకీయం అంటే గోల్ మాల్ చేయడం కాదు. మన కళ్ల ముందు ఇప్పుడు గేమ్ జరుగుతోంది.  రాజకీయాలు అంటే గేమ్స్ కావు.. అదొక  కర్తవ్యం. రాజకీయాల్లో ఈ దిశగా గుణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టేందుకే బీఆర్ఎస్ పెట్టినం’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.