రాష్ట్రానికి ఇవ్వడానికి కేంద్రం దగ్గర ఏమీ లేదు

రాష్ట్రానికి ఇవ్వడానికి కేంద్రం దగ్గర ఏమీ లేదు

హైద‌రాబాద్‌లో వచ్చిన వ‌ర‌ద‌లతో చాలా న‌ష్టం జ‌రిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. వ‌ర‌ద‌ల కారణంగా వివిధ ప్రాంతాల్లో రూ. 8 వేల కోట్ల న‌ష్టం జ‌రిగింద‌ని కేంద్రానికి నివేదిక పంపామని తెలిపారు. కేంద్రం నుంచి స్పంద‌న లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య రాజకీయాల్లో కొన్ని ఛీప్ విషయాలు వింటున్నామన్న సీఎం..మేమిచ్చాం మేమిచ్చాం అంటున్నారు.. మీదగ్గర వున్నది ఏంటీ...మాకు ఇచ్చేది ఏంటి..అని ప్రశ్నించారు. కేంద్రం ఏమిచ్చింది ఏమీ ఇవ్వలేదు అని అన్నారు. అంతేకాదు రాష్ట్రానికి ఇవ్వడానికి కేంద్రం దగ్గర ఏమీ లేదన్నారు. కేంద్రం డైయింగ్ పొజిషన్ లో వుంది..మీరు కేంద్రం పిచ్చి తగ్గించుకుంటే మంచిది అన్నారు.

మేము మొదటి సారి తక్కువ మెజారిటీతో..రెండోసారి భారీ మెజారిటీతో విజయం సాధించామని తెలిపారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ లో MIM.. మేము ఫ్రెండ్లీ పార్టీగా ఉన్నామని చెప్పారు. భట్టి విక్రమార్క సిఎల్పీ వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. మధ్య, దీర్ఘ కాలిక అవసరాలు, సంక్షేమం మా లక్ష్యమని అన్నారు కేసీఆర్. కులమతాలతో సంబంధం లేకుండా అందరికీ సమన్యాయం చేస్తున్నామన్నారు.

నవంబర్ లేదా డిసెంబర్ లో యాదాద్రి ప్రారంభం ఉంటుందన్న సీఎం కేసీఆర్..ప్రారంభోత్సవానికి ప్రెసిడెంట్, ప్రధానిని ఆహ్వానించామన్నారు.