వాసాలమర్రిలో ఇళ్లన్నీ కూలగొట్టి కొత్తవి కడ్తం

వాసాలమర్రిలో ఇళ్లన్నీ కూలగొట్టి కొత్తవి కడ్తం

ఆలేరు నియోజకవర్గంలో రూ.30కోట్లతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏదైనా ప్రమాదం ,అనారోగ్యం వచ్చినా దళిత రక్షణ నిధి నుంచే సాయం చేస్తామన్నారు. ఇవాళే జీవో విడుదల చేయిస్తామన్నారు. వాసాలమర్రిలోని దళిత కుటుంబాలతో సమావేశమయ్యారు కేసీఆర్. వాసాలమర్రి ఆలేరు నియోజకవర్గానికి దారి చూపాలన్నారు.  ఎర్రవెల్లిలో కూలగొట్టినట్టు ఉన్న ఇళ్లన్నీ కూలగొట్టి..ఆర్నెళ్లలో కొత్త ఇళ్లు నిర్మిస్తామన్నారు. వాసాలమర్రిలో ఎస్సీల కమతాల ఏకీకరణ జరగాలన్నారు. వాసాలమర్రిలో ప్రభుత్వ భూమి 100 ఎకరాలు ఉందన్నారు. మిగులు భూమిని నిరుపేదలకు పంచుతామన్నారు.మరో ఆర్నెళ్ల తర్వాత వచ్చి వాసాలమర్రి దళితవాడల్లోనే భోజనం చేస్తానన్నారు.