ఈ నెల 31లోపు డీసీసీ కార్యవర్గాలను ప్రకటించాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ఈ నెల 31లోపు డీసీసీ కార్యవర్గాలను ప్రకటించాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • డీసీసీ చీఫ్‌‌లు, అబ్జర్వర్లకు మీనాక్షి నటరాజన్‌‌, పీసీసీ చీఫ్ మహేశ్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులు ఈ నెల 31లోపు తమ కార్యవర్గాలను నియమించుకోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జూమ్‌‌ మీటింగ్‌‌లో డీసీసీ అధ్యక్షులతో, డీసీసీ నియామకాల కోసం నియమించిన పార్టీ ఇన్‌‌చార్జిలతో మహేశ్ గౌడ్, మీనాక్షి సమావేశమయ్యారు. 

33 డీసీసీ కార్యవర్గాలను నియమించేందుకు జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌‌చార్జిలు, పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను, సలహాలను తీసుకోవాలని వారిని కోరారు. కమిటీ నియామకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.